బావాజీ బ్రహ్మోత్సవాలకు ఎంపీకి ఆహ్వానం
NRPT: కొత్తపల్లి మండలం తిమ్మారెడ్డిపల్లిలో ఏప్రిల్ 1 నుంచి జరిగే శ్రీ గురులోక మసంద్ (బావాజీ) బ్రహ్మోత్సవాలకు రావాలని ఎంపీ డీకే అరుణను బీజేపీ నాయకులు కోరారు. బీజేపీ నాయకులు ఆమెను కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. గిరిజనుల ఆరాధ్య దైవమైన బావాజీ ఉత్సవాలు నాలుగు రోజుల పాటు వైభవంగా జరుగనున్నాయని నిర్వాహకులు తెలిపారు.