గ్రామపంచాయతీల అభివృద్ధిపై ఒకరోజు శిక్షణ

ప్రకాశం: పామూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం పంచాయతీల అభివృద్ధిపై ఒకరోజు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఎంపీడీవో మాట్లాడుతూ.. గ్రామాలలో సర్పంచులు స్థానిక సమస్యలను అధికార దృష్టికి తీసుకురావాలని తెలిపారు. గ్రామ మౌలిక వసతులు కల్పనలో సర్పంచులు కీలక పాత్ర పోషించాలన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, సర్పంచులు , ఎంపీటీసీలు పాల్గొన్నారు.