బీహార్‌కు కేంద్రం వరాల జల్లు

బీహార్‌కు కేంద్రం వరాల జల్లు

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ క్రమంలో బీహార్‌కు వరాల జల్లు కురిపించింది. బీహార్‌లోని పలు రోడ్డు, రైల్వే ప్రాజెక్టులు మంజూరు చేసింది. రూ.4,447 కోట్లతో మొకామా-ముంగేర్ హైవే మంజూరు చేసింది. రూ.3,169 కోట్లతో భగల్‌పూర్-దుంకా-రాంపూర్‌హట్ రైల్వేలైన్ డబ్లింగ్ పనులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.