VIDEO: 'ఎయిడెడ్ కళాశాలల విద్యార్థులకు న్యాయం చేయాలి'

KKD: ఎయిడెడ్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ నాయకులు కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు రామ్మోహన్ మాట్లాడుతూ.. ఎయిడెడ్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు కూడా పాఠ్య పుస్తకాలు అందజేయాలని, విద్యార్థులందరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.