తెనాలిలో పారిశుద్ధ్య పనులను పరిశీలించిన కమిషనర్

తెనాలిలో పారిశుద్ధ్య పనులను పరిశీలించిన కమిషనర్

GNTR: తెనాలిలోని 10, 11 వార్డులలో మున్సిపల్ కమిషనర్ లక్ష్మీపతి పర్యటించారు. ఉదయం నుంచి వార్డుల్లో తిరుగుతూ అక్కడ జరుగుతున్న ప్రత్యేక పారిశుద్ధ్య పనులను ఆయన పర్యవేక్షించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులు సిబ్బందిని ఆదేశించారు. పరిశుద్ధ్య నిర్వహణ మరింత మెరుగు పరచాలని, రోడ్లపై వ్యర్ధాలను తొలగించాలని సూచించారు.