కూటమి పాలనలోనే అంగన్వాడీ కార్యకర్తలకు గౌరవం: మంత్రి

కూటమి పాలనలోనే అంగన్వాడీ కార్యకర్తలకు గౌరవం: మంత్రి

ప్రకాశం: సీఎం చంద్రబాబు పాలనలోనే అంగన్వాడీ కార్యకర్తలకు రెట్టింపు గౌరవం, ఆర్థిక భద్రత లభించిందని మంత్రి స్వామి అన్నారు. చరిత్రలో తొలిసారి రెండు సార్లు అంగన్వాడీ వేతనాలను పెంచిన ఘనత సీఎం చంద్రబాబుదేనని స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో అంగన్వాడీలకు జీతాలు కూడా సరిగ్గా ఇవ్వలేదని విమర్శించారు. అంగన్వాడీ టీచర్లపై పనిభారాన్ని తగ్గించే యాప్లను కుదించినట్లు తెలిపారు.