ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించిన అధికారులు

ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించిన అధికారులు

NLR: సంగం మండలం దువ్వూరు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మండల స్పెషల్ ఆఫీసర్ రమేష్ నాయక్, మండల వ్యవసాయ అధికారి శశిధర్ గురువారం సందర్శించారు. ఈ కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోలు చేస్తున్న విధానాన్ని పరిశీలించి ఇప్పటి వరకు ఎంత ధాన్యం కొనుగోలు చేశారో తెలుసుకున్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని సిబ్బందికి సూచించారు.