ఏబీఎన్ రాధాకృష్ణపై పోలీసులకు ఫిర్యాదు

ఏబీఎన్ రాధాకృష్ణపై పోలీసులకు ఫిర్యాదు

సత్యసాయి: YCP అధినేత YS జగన్, పార్టీ నాయకుల కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏబీఎన్ రాధాకృష్ణపై హిందూపురంలో నిరసన వ్యక్తమైంది. నియోజకవర్గ ఇంఛార్జ్ దీపిక నాయకత్వంలో నాయకులు భారీ ర్యాలీగా వెళ్లి ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి మధుమతి రెడ్డి పాల్గొని, రాధాకృష్ణ తీరును ఎండగట్టారు.