వర్షాలు.. అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి

AP: రాష్ట్ర విపత్తు నిర్వహణశాఖ ఎండీకి మంత్రి అనిత ఫోన్ చేశారు. అకాల వర్షాల నేపథ్యంలో కలెక్టర్లు, ఎస్పీలను అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. వర్షాలు పడే ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలని సూచించారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను అధ్యయనం చేసి.. వాటికి అనుగుణంగా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.