రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం
GDWL: గద్వాలలోని వీరాపురం సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు 2026 సందర్భంగా గురువారం మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ ఎం. రాములు నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన విద్యార్థులకు ట్రాఫిక్ నియమాల ప్రాముఖ్యతను వివరించారు. ప్రాణం విలువైనదని, రోడ్డు భద్రతా నియమాలను తప్పక పాటించాలని, తల్లిదండ్రులకు కూడా చెప్పాలని సూచించారు.