సముద్ర ఆహార ఎగుమతుల్లో పోర్టు సత్తా
VSP: 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం రూ. 72,325.82 కోట్ల రికార్డు స్థాయి సముద్ర ఆహార ఎగుమతులు నమోదు చేయగా, ఇందులో విశాఖపట్నం పోర్టు కీలక పాత్ర పోషించింది. దేశంలో ప్రముఖ ఐదు ఓడరేవుల్లో ఒకటిగా నిలిచిన విశాఖ, మొత్తం ఎగుమతుల్లో గణనీయమైన వాటాను సాధించింది. ముఖ్యంగా ఫ్రోజెన్ రొయ్యల ఎగుమతిలో విశాఖ పోర్టు అందించిన వసతులే కారణం.