రేపు జోడలింగాల ఆలయంలో శివపార్వతుల కల్యాణం

రేపు జోడలింగాల ఆలయంలో శివపార్వతుల కల్యాణం

NZB: మోస్రాలోని ప్రసిద్ధ జోడలింగాల శివాలయంలో కార్తీక మాసం చివరి రోజు, మాస శివరాత్రి సందర్భంగా ఈ నెల 18వ తేదీ (మంగళవారం) శివపార్వతుల కల్యాణం నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు శేషారావు పంతులు తెలిపారు. సాయంత్రం దీపారాధన కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. చుట్టుపక్కల గ్రామాల భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని, విజయవంతం చేయాలని ఆయన కోరారు.