బౌలర్లకు ఏ మాత్రం సహకారం లేదు: కుల్దీప్

బౌలర్లకు ఏ మాత్రం సహకారం లేదు: కుల్దీప్

సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్ పిచ్ గురించి టీమిండియా బౌలర్ కుల్దీప్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోల్‌కతా పిచ్‌కు ఇది పూర్తిగా భిన్నంగా ఉందని తెలిపాడు. ఇది ఫ్లాట్ రోడ్డు లాంటి వికెట్ అని, టెస్ట్ క్రికెట్‌లో ఈ తరహా పిచ్‌లతో బౌలర్లకు అతిపెద్ద సవాల్ అని పేర్కొన్నాడు. తదుపరి టెస్ట్‌కు బౌలర్లకు మెరుగైన పిచ్ లభిస్తుందని ఆశిస్తున్నానన్నాడు.