పెనమలూరులో ట్రాఫిక్ పోలీసుల వినూత్న కార్యక్రమం

పెనమలూరులో ట్రాఫిక్ పోలీసుల వినూత్న కార్యక్రమం

కృష్ణా: జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు ఆదేశాలతో పెనమలూరు ట్రాఫిక్ పోలీసులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. ఈడుపుగల్లులోని నారాయణ ఇంగ్లీష్ మీడియం పాఠశాల విద్యార్థులతో కలిసి ట్రాఫిక్ నియమాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు ప్లకార్డులు పట్టుకుని రహదారి నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ట్రాఫిక్ సీఐ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.