VIDEO: 'అద్వానంగా పాపినేనిపల్లి రోడ్లు'

ప్రకాశం: అర్ధవీడు మండలం పాపినేనిపల్లి రోడ్లు అద్వానంగా తయారయ్యాయి. చిన్నపాటి వర్షానికి రోడ్లు చెరువుల తలపిస్తున్నాయి. ఆ రోడ్డు మీద వెళ్లాలంటే వాహనదారులు నరకయాతన పడుతున్నారు. దోమలు స్వైర విహారం చేస్తున్నాయని, అధికారులకు ఎన్నిసార్లు చెప్పిన పట్టించుకోవట్లేదని స్థానికుల ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.