మట్టి వినాయకులను పూజిద్దాం: CP

WGL: పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయకులను పూజించాలని పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సూచించారు. వినాయక చవితి పండుగ సందర్భంగా మంగళవారం మట్టితో చేసిన గణపతి విగ్రహాలను సిబ్బందికి సీపీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషన్ మాట్లాడుతూ.. రసాయనలతో తయారు చేసిన గణేశ్ విగ్రహాల ద్వారా వాతావరణం కాలుష్యం కావడంతో పాటు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు.