27న ఆత్మీయత సేవా సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

27న ఆత్మీయత సేవా సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

BHPL: ఈనెల 27వ తేది ఆదివారం రోజున జిల్లా కేంద్రంలోని 100 పడకల ఆసుపత్రిలో ఆత్మీయత సేవా సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయనున్నట్లు సొసైటీ అధ్యక్షులు బయ్యాన మహేందర్ తెలిపారు. అందుకు సంబంధించి ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నవీన్ కుమార్ నుండి అనుమతి పత్రం తీసుకున్నారు. యువత స్వచ్చందంగా రక్తదాన శిబిరంలో పాల్గొనాలని మహేందర్ కోరారు.