వరద ప్రాంతంలో మాజీ ఎమ్మెల్యే పర్యటన

MNCL: భారీ వర్షానికి జలమయమైన మంచిర్యాలలోని హమాలివాడ ప్రాంతంలో మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజల ఇబ్బందులను అడిగి తెలుసుకొని మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. డ్రైనేజీల్లో పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలగించి రోడ్లపైకి, ఇండ్లలోకి వర్షం నీరు రాకుండా చర్యలు చేపట్టాలని కోరారు.