బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మహీంద్రా రవి కుమార్
JN: కొడకండ్ల మండలం వావిలాల గ్రామంలో బీఆర్ఎస్ నేతలు ఇవాళ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నుంచి గ్రామానికి చెందిన అనపర్తి మహీంద్రా రవి కుమార్‌ను పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. గ్రామంలో ఎస్సీ మహిళ రిజర్వేషన్ రాగా వారికి ఈ అవకాశం దక్కింది. బీఆర్ఎస్ అభ్యర్థిని అధిక మెజారిటీతో గెలిపించుకోవాలని నేతలు పిలుపునిచ్చారు.