VIDEO: సీఎం పర్యటనకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు: ఎస్పీ

VIDEO: సీఎం పర్యటనకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు: ఎస్పీ

వనపర్తి జిల్లా ఆత్మకూరు పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారిక పర్యటనకు పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ సునీత రెడ్డి తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో పోలీసు అధికారులతో సమీక్షించారు. బందోబస్తు విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.