రాజమండ్రికి రూ.6 కోట్ల CSR నిధులు: ఆదిరెడ్డి
E.G: రాజమండ్రిలో రూ.6 కోట్లకు పైగా CSR నిధులు తీసుకువచ్చి తమ చిత్తశుద్ధి నిరూపించుకున్నామని ఎమ్మెల్యే వాసు పేర్కొన్నారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను మంగళవారం ఆయన పరిశీలించారు. ఇప్పటివరకు ఏ ఎమ్మెల్యే ఇంత పెద్ద ఎత్తున నిధులు తేలేదన్నారు. మరో రూ.80 లక్షల CSR నిధులు రానున్నాయని, వాటిని విద్య, వైద్యం, కమ్యూనిటీ హాళ్ల కోసం వెచ్చిస్తామని ఆయన తెలిపారు.