విపక్షాలు అబద్ధాలాడుతున్నాయి: అమిత్ షా

విపక్షాలు అబద్ధాలాడుతున్నాయి: అమిత్ షా

విపక్షాలు అన్నీ అబద్ధాలు చెబుతున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శించారు. 4 దశాబ్దాల తర్వాత లోక్‌సభ స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం రావడం దురదృష్టకరమని అన్నారు. స్పీకర్‌ను ఎన్నుకునే ప్రక్రియలో విపక్షాలు కూడా భాగస్వామ్యమయ్యాయని, ఇప్పుడు ఆయనపైనే అవిశ్వాసం పెట్టడం అర్థరహితమని మండిపడ్డారు. ప్రతిపక్షాలు కావాలనే గందరగోళం సృష్టిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.