రూ.50 వేలతో సంతోషి మాతకు అలంకరణ

NZB: నగరంలోని హమాల్ వాడి సంతోషి మాతకు రూ.50 వేల కరెన్సీతో అలంకరణ చేశారు. శ్రావణ శుక్రవారం, వరలక్ష్మీ వ్రతం సందర్భంగా అమ్మవారిని కరెన్సీ నోట్లతో అలంకరణ చేసినట్లు మహిళలు తెలిపారు. అనంతరం అమ్మవారికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని అమ్మవారిని వేడుకున్నారు.