హిమాయత్ సాగర్‌కు తగ్గిన వరద ఉధృతి

RR: ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ఉధృతి తగ్గడంతో జలాశయం ఒక ట్రస్ట్ గేటు మూడు ఫీట్ల మేర ఎత్తి 990 క్యూసెక్కుల నీరు ఈసీ నదిలోకి వదిలారు. వరద తగ్గడంతో హిమాయత్ సాగర్ నుంచి రాజేంద్రనగర్ వెళ్లే ఔటర్ సబ్ రోడ్డుపై రాకపోకలను పునరుద్ధరించారు. కాగా, జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1763.50 అడుగులు కాగా, ప్రస్తుతం 1762.15 అడుగులుగా ఉంది.