VIDEO: 'సచివాలయ నిర్మాణం పూర్తి చేయండి'
ELR: నూజివీడు మండలం వెంకటాయపాలెం గ్రామంలో సచివాలయ నిర్మాణం నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు తెలిపారు. గత పాలకులు నిర్మాణంలో చొరవ చూపకపోవడంతో సచివాలయానికి సొంత భవనం లేదని ప్రజలు వివరించారు. అధికారులు స్పందించి నిర్మాణ దశలో నిలిచిపోయిన సచివాలయాన్ని పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు. పంచాయితీ సమావేశాలకు తిప్పలు తప్పడం లేదన్నారు.