తమ పోట్ట కొట్టొద్దంటూ ఆటో డ్రైవర్ల భిక్షాటన

VZM: తమ పోట్ట కొట్టొద్దంటూ ఆటో డ్రైవర్లు గురువారం వేపాడ మండలం బొద్దాం జంక్షన్‌లో వినూత్నంగా బిక్షాటన చేశారు. ఈ సందర్భంగా వీరికి CITU పూర్వపు కార్యదర్శి చల్లా జగన్ మద్దతు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన 'స్త్రీ శక్తి పథకం' వల్ల తమ జీవనోపాధికి విఘాతం కలుగుతోందని, ప్రత్యామ్నాయ ఉపాధి కింద నెలకు రూ. 26,000 చెల్లించి ప్రజా రవాణా కింద ఆటోలను వాడాలని కోరారు.