ట్రైసైకిల్, వీల్‌చైర్ పంపిణీ

ట్రైసైకిల్, వీల్‌చైర్ పంపిణీ

విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డు పరిధిలోని వెలంపేటలో ఇద్దరు దివ్యాంగులకు ట్రైసైకిల్, వీల్‌చైర్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సీతంరాజు సుధాకర్‌ పాల్గొని లబ్ధిదారులకు వాటిని అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇలాంటి సేవా కార్యక్రమాలు దివ్యాంగులకు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.