VIDEO: మిర్యాలలో పోలీసుల కార్డెన్ అండ్ సెర్చ్
PLD: కారంపూడి మండలంలోని మిర్యాల గ్రామంలో పోలీసులు కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ వెంకటరమణ ఆధ్వర్యంలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన తనిఖీలలో సరైన పత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలు, కొన్ని మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు. గ్రామాల్లో శాంతి భద్రతల కోసం ప్రజలు కలిసిమెలిసి ఉండాలని, అనుమానాస్పద కార్యకలాపాలపై వెంటనే సమాచారం అందించాలని ఆయన సూచించారు.