VIDEO: అవసరమైన మరమ్మతులు చేపట్టాలి:కలెక్టర్

WNP: పట్టణంలోని వృత్తి విద్య కళాశాల మరమ్మతుల పనులకు రూ. 20 లక్షల నిధులు మంజూరయ్యాయని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. బుధవారం వృత్తి విద్య కళాశాలను ఆయన సందర్శించి తరగతి గదులు, పరిసరాలను పరిశీలించారు. మరుగుదొడ్లు నిర్మించి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అవసరమైన మరమ్మత్తుల పనులు దగ్గరుండి చేయించుకోవాలని కలెక్టర్ ప్రిన్సిపల్‌ను ఆదేశించారు.