ఐదంతస్తుల భవనం పైనుంచి పడి కూలీ మృతి
నల్గొండ విషాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఐదంతస్తుల భవనంపై పనిచేస్తున్న గోపయ్య(28) అనే వలస కూలీ ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందాడు. మృతుడు గోపయ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒంగోలుకు చెందిన స్థానికులు పేర్కొన్నారు. భవనం పైనుంచి పడి తీవ్ర గాయాల కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పేర్కొన్నారు. గోపయ్యకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నట్లు తెలిసింది.