'భారీ వాహనాలకు అనుమతించడం హర్షనీయం'

MNCL: కవ్వాల్ అభయారణ్యంలో ప్రభుత్వం భారీ వాహనాలను అనుమతించడం హర్షనీయమని జన్నారం మండల వర్తక సంఘం అధ్యక్షులు వామన్, ప్రధాన కార్యదర్శి రమేష్, కోశాధికారి శివరామకృష్ణ అన్నారు. గురువారం వారు మాట్లాడుతూ.. గతంలో భారీ వాహనాలకు అనుమతి లేకపోవడంతో వస్తువులను రాయపట్నం, జగిత్యాల మీదుగా తీసుకొచ్చే వారమని తెలిపారు. ప్రస్తుతం అనుమతి రావడంతో రవాణా వ్యయం తగ్గుతుందన్నారు.