వెంకటేశ్వర పల్లి సర్పంచ్‌గా మహేందర్ రెడ్డి
HNK: కమలాపురం మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. వెంకటేశ్వర పల్లి గ్రామ సర్పంచ్‌గా పెండ్యాల మహేందర్ రెడ్డి విజయం సాధించారు. సమీప ప్రత్యర్థిపై స్వల్ప ఓట్ల తేడాతో గెలుపొందారు. దీంతో సర్పంచ్ అనుచరులు గ్రామంలో టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.