'గాజులపేటలో డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేదు'
GDWL: అయిజ మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డు గాజులపేటలో డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో మురుగు నీరు నిలిచి, ప్రజల జీవితం ప్రమాదంలో పడిందని బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు ఎస్. రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. శనివారం పట్టణ అధ్యక్షుడు కంపాటి భగత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన సందర్శించారు. మురుగు నీటి వల్ల డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రజలకు వస్తాయన్నారు.