రైలు పట్టాల మధ్య గుర్తుతెలియని మృతదేహం లభ్యం

HNK: కాజీపేట రైల్వే జంక్షన్ -హసన్‌పర్తి రోడ్ రైల్వే స్టేషన్‌ల మధ్యలోని వడ్డేపల్లి ఆర్ఓబీ రైలు పట్టాల మధ్య గుర్తుతెలియని వృద్ధుడి మృతదేహాన్ని మంగళవారం గుర్తించినట్లు జీఆర్పి సీఐ నరేష్ తెలిపారు. సీఐ కథనం ప్రకారం.. దాదాపు 70 సంవత్సరాల వయసున్న వృద్ధుడి మృతదేహాం కుళ్లిన స్థితిలో గుర్తించి ఎంజీఎం మార్చురీకి తరలించినట్లు తెలిపారు.