చెట్టును ఢీ కొట్టిన కోళ్ల వ్యాన్.. కౌటాల వాసి మృతి

చెట్టును ఢీ కొట్టిన కోళ్ల వ్యాన్.. కౌటాల వాసి మృతి

ASF: కౌటాల నుంచి వెళ్తున్న కోళ్ల వ్యాన్ పెద్దపల్లి వద్ద గురువారం తెల్లవారుజామున నియంత్రణ కోల్పోయి చెట్టును బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ జ్యోతి నగర్‌కు చెందిన వెంకటేశ్ మృతి చెందగా, మరో డ్రైవర్ డౌలత్ క్షేత్రగాత్రుడయ్యాడు. తెల్లవారుజామున చీకటిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు