'అమెరికా వాణిజ్య ఒప్పందం రద్దు చేయాలి'

'అమెరికా వాణిజ్య ఒప్పందం రద్దు చేయాలి'

నంద్యాల: అమెరికాతో కుదిరిన వాణిజ్య ఒప్పందాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ డిమాండ్ చేశారు. శుక్రవారం నందికొట్కూరు పోస్టాఫీసు నుంచి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రైతు సంఘం నాయకుడు బెస్త రాజుతో కలిసి వినతిపత్రం పంపారు. భారత్అ-మెరికా వాణిజ్య ఒప్పందం రైతులకు నష్టం కలిగిస్తుందని ఆరోపిస్తూ.. దానిని రద్దు చేయాలని కోరారు.