ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే సహించేది లేదు: జోగు రామన్న
ADB: తెలంగాణ ప్రజల అస్తిత్వం, ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే సహించబోమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లాధ్యక్షుడు జోగు రామన్న అన్నారు. శనివారం పార్టీ శ్రేణులతో కలిసి బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ ఆదిలాబాద్‌లో నిరసన కార్యక్రమం చేపట్టారు. మహిళా బిల్లు ఆమోదం పొందకుండా కాంగ్రెస్, బీజేపీ పార్టీలు మహిళలను మోసం చేశాయని పేర్కొన్నారు.