‘మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తాం’

AKP: జీవీఎంసీ విలీన గ్రామాలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని రాష్ట్ర అర్బన్ అండ్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఛైర్మన్ గోవింద్ తెలిపారు. గురువారం అనకాపల్లి జీవీఎంసీ జోన్ 80వ వార్డు విలీనం గ్రామాలైన ఎరుకువానిపాలెం, వల్లూరు గ్రామాల్లో ఆయన పర్యటించారు. గ్రామాల్లో తాగునీటి అమృత పథకంతో తాగు నీటి సమస్యను పరిష్కరిస్తామన్నారు.