VIDEO: విఘ్నేశ్వరుని ఆలయానికి పోటెత్తిన భక్తులు
కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక ఆలయానికి ఉగాది పర్వదినం సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఉదయం నుంచి అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. ఆలయ ప్రాంగణాన్ని ప్రత్యేక పూలతో అలంకరించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలుగకుండా ఆలయ ఈవో సత్యనారాయణ రాజు ఏర్పాట్లను పర్యవేక్షించారు.