క్యాన్సర్ బాధితునికి ఆర్థిక సాయం

క్యాన్సర్ బాధితునికి ఆర్థిక సాయం

SKLM: సంతబొమ్మాలి మండలం చిల్లపేట గ్రామానికి చెందిన బొడ్డ ప్రసాద్ రావు క్యాన్సర్ బారిన పడ్డారు. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా చికిత్స అందిస్తున్నప్పటికీ మందుల కోసం డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న టెక్కలి అభయం యువజన సేవా సంఘం వారు రూ.10,000 ఆర్థిక సాయం చేశారు. సంఘం అధ్యక్షులు దేవాది శ్రీనివాసరావు అందజేశారు.