ఉమెన్ బాస్కెట్ బాల్ పోటీల్లో ఏలూరు జట్టు విజయం
ELR: విశాఖపట్నంలో నవంబర్ 7-10 వరకు జరిగిన సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ బాస్కెట్ బాల్ ఉమెన్ విభాగంలో జిల్లా బాలికలు విజేతలుగా నిలిచినట్లు DSDO అజీజ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఏలూరులోని ASR స్టేడియంలో విజేతలకు ట్రోఫీలు అందించారు. గోల్డ్ మెడల్ సాధించిన మహిళా జట్టును ఫుట్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి పవన్ కుమార్ ప్రశంసించారు.