చింతలపాలెంలో ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు
SRPT: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో భాగంగా చింతలపాలెం మండల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద ఇవాళ ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహించింది. ఈ సందర్భంగా మండల కేంద్రం మీదుగా వెళ్లే ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలతో పాటు ఇతర వాహనాలను నిలిపివేసి పూర్తిస్థాయిలో తనిఖీ చేశారు.