సిరిసిల్లలో హనుమాన్ శోభాయాత్ర
సిరిసిల్ల పట్టణంలోని ఆర్యవైశ్య భవనం నుంచి హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ శోభాయాత్రను ఇవాళ నిర్వహించనున్నారు. విశ్వహిందు పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా సాయంత్రం 5 గంటలకు బైక్ ర్యాలీ ప్రారంభమవుతుందని వారు తెలిపారు. హిందువులందరూ పెద్ద ఎత్తున పాల్గొని శోభాయాత్రను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.