కుల్దీప్ ‘రోడ్డు’ వ్యాఖ్యలపై విమర్శలు

కుల్దీప్ ‘రోడ్డు’ వ్యాఖ్యలపై విమర్శలు

దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 201 పరుగులకు ఆలౌటైంది. అయితే, 'ఇది కోల్‌కతా పిచ్‌లా కాదు.. రోడ్డులా ఉంది' అని సౌతాఫ్రికా ఇన్నింగ్స్ అనంతరం స్పిన్నర్ కుల్దీప్ అన్నాడు. టెయిలెండర్లు ఆడటంలో తమ తప్పేమీ లేదని.. లోపమంతా పిచ్‌దే అని చెప్పాడు. దీంతో.. మరి టీమిండియా ఎందుకు ఆ రోడ్డు మీద బొక్క బోర్లా పడిందని పలువురు విమర్శిస్తున్నారు.