కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

కృష్ణా: దిత్వా తుఫాన్ నేపథ్యంలో మచిలీపట్నం కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. తుఫాన్ కారణంగా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో 08672-252399 నంబర్‌తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ బాలాజీ ఈరోజు తెలిపారు. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని, రైతులు పండించిన ధాన్యం తడిచిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.