వరద ప్రభావిత ప్రాంతంలో ముమ్మరంగా సహాయక చర్యలు

వరద ప్రభావిత ప్రాంతంలో ముమ్మరంగా సహాయక చర్యలు

E.G: గోదావరి నది ఉధృతి నేపథ్యంలో రాజోలు మండలం కేంద్రం రాజోలు స్థానికంగా ఉన్న వారి బాడవ ప్రాంతం వరద నీటి ప్రభావానికి గురైంది. ఈ సందర్భంగా స్థానికులకు ఆర్డబ్ల్యూఎస్ అధికారుల సహాయంతో మంచినీటి సదుపాయాన్ని ఏర్పాటు చేసినట్లు రాజోలు పంచాయతీ సెక్రెటరీ రెహమాన్ శనివారం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రేవు జ్యోతి, ఉప సర్పంచ్ పామర్తి రమణ, తదితరులు పాల్గొన్నారు.