VIDEO: వట్టివాగులో ఘన సమ్మక్క తల్లి ఊరేగింపు
MHBD: గూడూరు మండలం వట్టివాగులో సమ్మక్క తల్లి గద్దెలకు ఊరేగింపు గురువారం ఘనంగా జరిగింది. ఆదివాసీ సంప్రదానం ప్రకారం, డప్పుల వాయిద్యాలతో, పూజారులు తల్లి సమ్మక్కను వట్టివాగు నుంచి గద్దెల వద్దకు తీసుకువచ్చారు. వేలాది భక్తులు ‘జై సమ్మక్క.. జై సారలమ్మ’ నినాదాలతో హృదయపూర్వకంగా పాల్గొన్నారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.