ఆస్తి పన్నుపై ఐదు శాతం రిబేట్: కమిషనర్

ఆస్తి పన్నుపై ఐదు శాతం రిబేట్: కమిషనర్

CTR: ఆస్తి పన్నుపై ఐదు శాతం రిబేట్ అందిస్తున్నట్టు చిత్తూరు మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో బకాయిలు లేకుండా.. ఒకేసారి మొత్తం చెల్లించే వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని స్పష్టం చేశారు. ఇందుకోసం ఏప్రిల్ 30 వరకు అవకాశం ఉంటుందన్నారు. ఆస్తి పన్నుపై 50 శాతం వడ్డీ మాఫీ గడువును కూడా ఈ నెల 30 వరకు పొడగించామన్నారు.