నర్సరీలను సంరక్షించాలి: ఎంపీడీవో
NGKL: మొక్కలను ప్రాణప్రదంగా కాపాడుకోవాలని ఎంపీడీవో లింగయ్య సూచించారు. శనివారం తుర్కపల్లి పంచాయతీ నర్సరీని తనిఖీ చేసిన ఆయన.. ఎండల తీవ్రత దృష్ట్యా షేడ్ నెట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఉదయం, సాయంత్రం క్రమం తప్పకుండా నీరు పోయాలని సిబ్బందిని కోరారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్ సరిత, ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు.