కావలిలో DSP తనిఖీలు

NLR: కావలిలోని పెంకుల ఫ్యాక్టరీ గిరిజన సంఘంలో డీఎస్పీ శ్రీధర్ సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు. ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించి అనుమానాస్పద వ్యక్తుల వివరాలను ఆరా తీశారు. 53 బైక్‌లు, 3 ఆటోలకు సంబంధించి సరైన పత్రాలు లేవని వాటిని సీజ్ చేశారు. తెలియని వారు ఎవరైనా తిరిగితే సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.